పెళ్లికి పిలిచి, భోజనానికి రూ. 3,800 చార్జ్ చేస్తామంటే ఎలా?

Lavish destination wedding hosts asks guests to pay Rs 3,600 for dinner charges makes netizens confused
x

పెళ్లికి పిలిచి, భోజనానికి రూ. 3,800 చార్జ్ చేస్తామంటే ఎలా?

Highlights

పెళ్లిలో విందు భోజనం ఫ్రీ అనే విషయం అందరికీ తెలిసిందే. పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, లేక పప్పన్నమే పెట్టినా... అది ఉచితమే కానీ దానికి ఎవ్వరూ డబ్బులు...

పెళ్లిలో విందు భోజనం ఫ్రీ అనే విషయం అందరికీ తెలిసిందే. పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, లేక పప్పన్నమే పెట్టినా... అది ఉచితమే కానీ దానికి ఎవ్వరూ డబ్బులు తీసుకోరు. ఇందులో ఎవ్వరికైనా సరే రెండో ఆలోచన అనేదే ఉండదు.

అందులోనూ విదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అక్కడి ఏర్పాట్లపై ఇంకాస్త ఎక్కువ అంచనాలే ఉంటాయి. అంత ఖర్చు పెట్టుకుని పెళ్లికి వెళ్లినందుకుగాను అక్కడి ఏర్పాట్లతో ఎంజాయ్ చేయొచ్చులే అనే ఆ పెళ్లికి వెళ్లే గెస్టులు భావిస్తారు. కానీ ఇప్పుడు మీు తెలుసుకోబోయే ఈ పెళ్లి కహానీ మాత్రం వేరే. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ స్టోరీలో పెళ్లికి పిలిచిన వారు అతిధులకు భలే ట్విస్ట్ ఇచ్చారు.

తనకు ఎదురైన ఒక వింత అనుభవాన్ని ఒక నెటిజెన్ రెడిట్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో ఒక పెళ్లికి హాజరు కావాల్సిందిగా తనకు ఒక ఆహ్వానం అందింది. తను ఉండేది కెనడాలోని వాన్‌కోవర్. అంటే ఆ పెళ్లికి వెళ్లేందుకు దేశం దాటి వెళ్లాలి. ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు అన్నీ కలిపి తడిసి మోపెడవుతాయని లెక్కలేసుకున్నారు. అందుకే ఒక చిన్న మొత్తంలో నగదు బహుమతి ఇద్దాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే పెళ్లిలో మీ డిన్నర్ ఖర్చు 40 యూరోలు (భారతీయ కరెన్సీలో రూ.3,800) మీరే భరించాలి అని రాసి ఉంది. అది చూసి షాక్ అయ్యాను అని ఆ నెటిజెన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.


విమానం చార్జీలు, హోటల్ అద్దె... ఇలా అన్నీ కలిపి బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకుని పెళ్లికి వెళ్తే భోజనం కోసం డబ్బులు కట్టాల్సిందిగా అడగడం ఏంటని ఆ నెటిజెన్ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. ఇదేం మర్యాద అని ఆశ్చర్యపోవడమే కాకుండా అసలు ఇది మర్యాద అనిపించుకుంటుందా అని ప్రశ్నించారు.

ఆ నెటిజెన్ పెట్టిన రెడిట్ పోస్టుకు నెటిజెన్స్ నుండి భారీ స్పందన కనిపించింది.

పెళ్లికి పిలిచి భోజనం కోసం డబ్బులు అడగడం అనేది అసలు మర్యాదే కాదని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ రాస్తున్నారు. ఇలాంటి పెళ్లి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అందులోనూ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఈ ఘోరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పెళ్లికి వెళ్లు కానీ డిన్నర్ మాత్రం బయటే చేయ్ అని కొంతమంది సలహా ఇస్తున్నారు.

పెళ్లికి వెళ్తూ 40 యూరోల కంటే తక్కువ ఖర్చులో పని అయిపోయేలా మీ డిన్నర్ మీరే వెంట తీసుకెళ్లండి అని ఇంకో నెటిజెన్ సూచించారు.

ఈ విషయాన్ని పంచుకున్న నెటిజెన్ కూడా స్పందిస్తూ.. "చిన్న నగదు బహూమతి ఇద్దామనుకున్నా కానీ ఇక అది ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది" అని అన్నారు.

Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?

Show Full Article
Print Article
Next Story
More Stories