నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌

admin1
Updated on: 3 Feb 2020 11:29 AM IST
నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం శారదాపీఠం నుంచి 12.50కి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు.

admin1

admin1

Next Story