Vizag: మందుబాబులకు షాకిచ్చిన విశాఖ భీమిలి కోర్టు.. ఉమెన్స్ కాలేజీని శుభ్రం చేయాలని ఆదేశం

Vizag: మందుబాబులతో కాలేజీని క్లీన్ చేయించిన ట్రాఫిక్ పోలీసులు

Dhatripriya
Published on: 14 May 2023 8:03 AM IST
Vizag Bheemili Court Gave Shock To Alcohol Addicts
X

Vizag: మందుబాబులకు షాకిచ్చిన విశాఖ భీమిలి కోర్టు.. ఉమెన్స్ కాలేజీని శుభ్రం చేయాలని ఆదేశం 

Vizag: మందుబాబులకు షాక్ నిస్తూ విశాఖ భీమిలీ కోర్టు మరోసారి సంచలన తీర్పు ప్రకటించింది. మద్యంతాగి వాహనాలు నడుపుడూ పోలీసులకు పట్టుబడ్డ వారిలో 21 మందికి వెయ్యి రూపాయల జరిమాన విధించింది 15వ అదనపు మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్. అలాగే మరో 63 మందికి కమ్యూనిటి సర్వీస్ భాగంగా విశాఖ ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించింది. దీంతో ఖంగుతిన్న మందుబాబులు కోర్టు తీర్పును గౌరవిస్తూ..ఉమెన్స్ కాలేజీ పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తా, చెదారాన్ని మొత్తం తీసేసి కాలేజీని క్లీన్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story