అవంతికి ఆదిలోనే అసలైన సవాలేది?

అవంతికి ఆదిలోనే అసలైన సవాలేది?
x
Highlights

ఎప్పుడొచ్చామన్నది కాదయ్యా మంత్రి పదవి కొట్టామా లేదా అంటున్నారు ఓ మంత్రి. అయితే ఎక్కడి నుంచో వచ్చి, ఏ పార్టీ నుంచో వచ్చి, మా కడుపు కొట్టావు కదా అని,...

ఎప్పుడొచ్చామన్నది కాదయ్యా మంత్రి పదవి కొట్టామా లేదా అంటున్నారు ఓ మంత్రి. అయితే ఎక్కడి నుంచో వచ్చి, ఏ పార్టీ నుంచో వచ్చి, మా కడుపు కొట్టావు కదా అని, పార్టీలో ఆల్రెడీ పాతుకుపోయిన నేతలంటున్నారట. కండువా మార్చి మినిస్ట్రీ ఎక్కిన, ఆ మినిస్టర్‌‌పై లోలోపల రగిలిపోతున్నారట. దీంతో కొత్త బాధ్యతల చేపడుతున్న ఆ మంత్రి, జిల్లాలో కొందరు నేతల తీరుపట్ల నిరుత్సాహపడుతున్నారట ఇంతకీ ఎవరా మంత్రి ఎందుకంత అసమ్మతి?

మంత్రిగా చేయాలన్నది ఆయన కల. అందుకే పార్లమెంట్‌ సీటును కాదని, పార్టీని కాదని, భీమిలి నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టారు. భీమిలి నుంచి గెలిచారు. చివరికు మంత్రి పదవి ఒడిసిపట్టి అనుకున్నది సాధించుకున్నారు. అదే జిల్లాలో కోల్డ్‌వార్‌కు దారి తీస్తోంది. సీఎం జగన్ డ్రీమ్ కేబినెట్‌లో విశాఖ నుంచి ఒకే ఒక్కడికి ఛాన్స్ దక్కింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని, టీడీపీ నుంచి వలస వచ్చిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు కేబినెట్ బెర్త్ కేటాయించారు జగన్. ఆవిర్భావం నుంచి పార్టీ నమ్ముకున్న వారిని కాదని వలస నేతకు పట్టం కట్టడంతో, సీనియర్ నేతలు చాపకింద నీరులా అసమ్మతి రాగాలు మొదలుపెట్టారు. అదే ఇఫ్పుడు విశాఖ వైసీపీలో నివురుగప్పిన నిప్పులా తయారైంది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముత్తంశెట్టి అలియాస్‌ అవంతి శ్రీనివాసరావు ఇపుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో కేంద్రబిందువయ్యారు. ఎందుకంటే విశాఖ జిల్లా నుంచి కేబినెట్‌లో బెర్తు సంపాదించిన ఏకైక ఎమ్మెల్యే. అందులోనూ వలస నేత. మంత్రి పదవి కోసం అవంతి శ్రీనివాస్‌ ఎంతగా ఆరాటపడ్డారంటే, చివరకు తన ఆప్తమిత్రుడు గంటా శ్రీనివాసరావుతో విభేదాలొచ్చినా వెరవలేదు. చివరి నిమిషంలో వైసీపీలోకెళ్లారు. భీమిలి సీటు తెచ్చుకున్నారు. ఘన విజయం సాధించి, ఇపుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు మొదటి నుంచీ చెబుతూ వచ్చాయి. అయితే జగన్ టీంలో అవంతికి మాత్రమే చోటు దక్కడంతో జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన ఆశావహులు నిరాశలో కూరుకుపోయారు. అయిన్నప్పటికీ ముఖ్యమంత్రి మాటే శిరోధార్యం అన్నట్టుగా నేతలు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికలను ఎదుర్కొవడంతో పాటు అసంతృప్తి నేతలను కలుపుకుపోవడం ముత్తంశెట్టి ముందున్న సవాలు. మరి కొత్తగా వైసీపీలోకి వచ్చి, ప్రారంభంలోనే జాక్‌పాట్ కొట్టేసిన అవంతి శ్రీనివాస్ అసమ్మతిని చల్లార్చుకుంటారా?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories