Visakhapatnam Collector: రైల్వే డిపార్ట్మెంట్ కు ఇప్పటికే భూమిని ఇచ్చాం

Visakhapatnam Collector: 2023 డిసెంబర్ లో ఏపీ సీఎస్ తో జరిగిన సమీక్షలో.. రైల్వేజోన్ భూమిపై స్పష్టత ఇచ్చామన్న విశాఖ కలెక్టర్

Shekhar G
Published on: 2 Feb 2024 7:42 PM IST
Visakhapatnam Collector Said That We Have Already Given The Land To The Railway Department
X

Visakhapatnam Collector: రైల్వే డిపార్ట్మెంట్ కు ఇప్పటికే భూమిని ఇచ్చాం

Visakhapatnam Collector: రైల్వే జోన్ కు సంబంధిచిన భూమిని.. ఇండియన్ రైల్వే డిపార్ట్ మెంట్ ఇప్పటికే ఇచ్చామన్నారు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జన. గత ఏడాది డిసెంబర్ నెలలో ఏపీ సీఎస్ తో జరిగిన సమీక్షలో కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చామని తెలిపారు. ముడసరలోవ సర్వ్ నెంబర్ 26లో.. రైల్వే వారికి భూమి సిద్ధం చేసి, ఫెన్సింగ్ కూడా వేశామని చెప్పారు. రైల్వే వారికి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం ఎంత అడిగారో అంత భూమిని ఇచ్చామన్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు బృందం కూడా తమను కలవనున్నారని విశాఖ కలెక్టర్ చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story