పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరాం: విజయసాయిరెడ్డి

admin1
Updated on: 17 Nov 2019 5:17 PM IST
vijayasaireddy
X
vijayasaireddy

రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రస్థావించామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ముఖ్యంగా పోలవరం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సభ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పోలవరం విషయంలో ఇప్పటికీ 3వేల కోట్ల పైగా బిల్లులు పెండింగ్‌లో ఉందని, వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయమని, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ విడుదల చేయమని కోరినట్టు చెప్పారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం బుందేల్‌ఖండ్ ప్యాకేజీని అంటే ఏపీకి 24వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయాలన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించామన్నారు విజయసాయిరెడ్డి


admin1

admin1

Next Story