MP Vijayasai Reddy: హాట్‌ కామెంట్స్‌.. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు

MP Vijayasai Reddy కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నారు కదా..

Dhatripriya
Updated on: 13 Jun 2023 4:48 PM IST
Vijayasai Reddy Hot Comments On State Parties
X

MP Vijayasai Reddy: హాట్‌ కామెంట్స్‌.. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు

MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటుందని, పార్టీ వేరు.. ప్రభుత్వం వేరని ఆయన అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయన్న విజయసాయిరెడ్డి.. అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్‌షా, నడ్డా చెప్పలేకపోయారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నారు కదా.. వాళ్ల ఆడిటింగ్‌లో ఎక్కడైనా అవినీతి జరిగిందని గుర్తించారా..? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అవినీతి అని సాధారణంగా ఆరోపణలు చేశారని ఫైర్‌ అయ్యారు. ఇక.. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ రద్దుపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయలేదన్న విజయసాయిరెడ్డి.. విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని గుర్తుచేశారు. వైసీపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక.. విశాఖకు కచ్చితంగా పరిపాలన రాజధానిని తరలిస్తామన్న విజయసాయిరెడ్డి.. రెండేళ్ల కిందటే పరిపాలన రాజధానికి కావాల్సిన ఆఫీస్‌లు గుర్తించామన్నారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story