Payakaraopeta: విశాఖ జిల్లాలో విజిలెన్స్ దాడులు

S. Srikanth
Published on: 3 Feb 2020 4:29 PM IST
Payakaraopeta: విశాఖ జిల్లాలో విజిలెన్స్ దాడులు
X

పాయకరావుపేట: నియోజకవర్గంలోని పలు మేజర్ పంచాయతీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ నరసింహమూర్తి, సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. గతంలో పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సంపద కేంద్రాల నిర్వహణ, చెత్త సేకరణ కోసం చెత్త బుట్ట​ల పంపిణీ, సిబ్బంది వేతనాలు తదితర అంశాలపై ఈ విచారణ కొనసాగించారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story