రాజధానిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక వ్యాఖ్యలు

రాజధానిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక వ్యాఖ్యలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. పాలన ఒక్కచోటు నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన పేర్కొన్నారు....

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. పాలన ఒక్కచోటు నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో మీడియాతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటే ఉండాలని, అన్ని ఒక్కచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని చెప్పారు.

అయితే, అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమన్నారు వెంకయ్యనాయుడు. 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నానన్న ఆయన వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో తన అభిప్రాయం చూడవద్దన్నారు. కేంద్రం తనను అడిగితే ఇదే అభిప్రాయం చెబుతానన్నారు వెంకయ్యనాయడు.

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు పరిపాలన కేంద్రీకృతం కావాలన్నారు. రాజధాని రైతులు తన వద్దకు వచ్చారన్నారు వాళ్ల భావోద్వేగం చూసి మనసు చలించిందని చెప్పారు వెంకయ్యనాయుడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories