Vemireddy: వైసీపీకి షాక్‌.. ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

Vemireddy: తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన వేమిరెడ్డి

Shekhar G
Published on: 21 Feb 2024 2:59 PM IST
Vemireddy Prabhakar Reddy Resigned to YSRCP Party
X

Vemireddy: వైసీపీకి షాక్‌.. ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

Vemireddy: నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధిష్టానానికి లేఖ రాసిన వేమిరెడ్డి.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులు కార్యకర్తలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో తనకు అవమానాలు జరిగాయంటూ సన్నిహితులతో వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, టీడీపీ నేతలు వేమిరెడ్డిని కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారా అనే చర్చ జరుగుతోంది.

Shekhar G

Shekhar G

Next Story