Vemireddy: వైసీపీకి షాక్‌.. ఎంపీ వేమిరెడ్డి గుడ్‌బై!

Vemireddy: ఇవాళ వైసీపీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో వేమిరెడ్డి..?

Jyothi
Published on: 21 Feb 2024 12:18 PM IST
Vemireddy Planning to Resign from YCP
X

Vemireddy: వైసీపీకి షాక్‌.. ఎంపీ వేమిరెడ్డి గుడ్‌బై!

Vemireddy: నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో.. నగర డిప్యూటీ మేయర్.. పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం వైసీపీకి, జిల్లా అధ్యక్ష పదవికి వేమిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తుపై నెల్లూరులోని తమ నివాసంలో అనుచరులు కార్యకర్తలతో చర్చలు జరపనున్నారు. పార్టీలో తనకు అవమానాలు జరిగాయంటూ సన్నిహితులతో వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, టీడీపీ నేతలు వేమిరెడ్డిని కలిశారు.

Jyothi

Jyothi

Next Story