Vellampalli: సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదు
Vellampalli: బోండా ఉమ లాంటి పెత్తందారుల పాలన ప్రజలకు అవసరంలేదు
Vellampalli: సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదు
Vellampalli: సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు లేదని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారో వారికి తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కుప్పంలో పోటీ చేయాలంటే భయం.. లోకేష్‌కు మంగళగిరిలో పోటీ అంటే భయం.. పవన్ గాజువాకలో పోటీ చేయాలంటే భయపడుతున్నారని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమాకు సవాల్ విసిరారు వెల్లంపల్లి. తనతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించాలని సవాల్ చేశారు. రోడ్డుపై పది మందిని వెనకేసుకుని ధర్నాలు చేయడం కాదన్నారు వెల్లంపల్లి. బోండా ఉమ లాంటి పెత్తందారుల పరిపాలన విజయవాడ ప్రజలకు అవసరంలేదన్నారు వెల్లంపల్లి.
Next Story




