Katrenikona: 750 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

S. Srikanth
Published on: 18 April 2020 8:57 PM IST
Katrenikona: 750 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
X

కాట్రేనికోన: కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా నిరుపేదలను ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు చేయ్యేరు సొసైటీ అధ్యక్షులు, ఆక్వా రైతు మంతెన మమ్మురాజు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మమ్మురాజు మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుందని, దీని నుండి బయట పడేందుకు ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం తప్పక పాటించాలని ఆయన సూచించారు.

కాట్రేనికోన పంచాయితీ పరిధిలో రామస్వామితోట, చెంచులగరువు తదితర ప్రాంతాల్లో మమ్మురాజు ఆధ్వర్యంలో సుమారు 750 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి నడింపల్లి సూరిబాబు, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ నల్లా నరసింహమూర్తి, కాట్రేనికోన సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి, విద్యా కమిటీ చైర్మన్ మోకా అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story