Vasireddy Padma: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. రాజీనామా లేఖలో ఘాటుగా స్పందించిన..

Vasireddy Padma: ఏపీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వాసిరెడ్డి పద్మ... వైసీపీకి రాజీనామా చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Oct 2024 12:14 PM IST
Vasireddy Padma Resign To Ysrcp
X

Vasireddy Padma: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. రాజీనామా లేఖలో ఘాటుగా స్పందించిన..

Vasireddy Padma: ఏపీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వాసిరెడ్డి పద్మ... వైసీపీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం వాసిరెడ్డి పద్మ ప్రయత్నం చేశారు. అధిష్ఠానం టికెట్ కేటాయించకపోవడంతో కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు. జగ్గయ్యపేట టికెట్ విషయంలో పార్టీ వైఖరి నచ్చకే రాజీనామా చేసినట్లు సమాచారం.

రాజీనామాలేఖలో జగన్‌పై ఘాటుగా స్పందించారు. పార్టీని నడిపించడంలో జగన్‌కి బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా లేదన్నారు పద్మా. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని ఎన్నికల తీర్పుతో స్పష్టమైందన్నారు. ప్రమోషన్ పదం వినియోగించడానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదన్నారు వాసిరెడ్డి పద్మ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story