Mylavaram: మాజీమంత్రికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే

మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు.

S. Srikanth
Updated on: 25 Feb 2020 5:24 PM IST
Mylavaram: మాజీమంత్రికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే
X

మైలవరం: మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమా నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో నేరుగా పోటీ పడు, చేతగాని దద్దమ్మ లా ఎక్కడ పడితే అక్కడ సోల్లు వాగుడు ఎందుకు, ఎమ్మెల్యేగా మంత్రిగా పదేళ్ళ మైలవరంకు నువ్వు ఎం చేశావో చెప్పుకో, నేను ఈ పది నెలలు కాలంగా మైలవరంకు ఎం చేశానో తెలుసుకో, ఇబ్రహీంపట్నం పాతగేటు వద్ద 2014 లో రూ.150 కోట్లు వ్యయంతో పురా అధ్వర్యంలో చేపట్టిన మంచినీటి పధకం నీకు కనపడలేదా మంత్రి గా ఉండి నీవు ఎం చేశావు.

మైలవరం నియోజకవర్గంకి ఏమి చేయ్యలేదు కాబట్టే ప్రజలు నిన్ను తరిమి కొట్టారు. రాజకీయ నిరుద్యోగిగా ఉన్న నీవు నిరంతరం ధర్నాలు, ఆందోళనలు చేయడం తప్ప నీ వలన ఏం ప్రయోజనం లేదని తెలు సుకో, మతిబ్రమించి మానసిక రోగిలా తయారైన నీవు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితిలో ఉన్నావని విమర్శించారు.


S. Srikanth

S. Srikanth

Next Story