Vangalapudi Anitha: జగన్‌ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా?

Vangalapudi Anitha: డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ పర్యటను చివరి నిమిషంలో రద్దుచేసుకుని.. నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Sept 2024 3:26 PM IST
Vangalapudi Anitha Slams Jagan For His Allegations On Tirumala Entry
X

Vangalapudi Anitha: జగన్‌ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా?

Vangalapudi Anitha: డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ పర్యటను చివరి నిమిషంలో రద్దుచేసుకుని.. నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు. అన్ని మతాలను గౌరవించినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వమంటే.. దళితులకు దాన్ని ఆపాదించి మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్దారు. అసలు జగన్‌కు దళితులపై మాట్లాడే హక్కే లేదని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు.

జగన్‌ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? అక్షితలు వేసిన వెంటనే దులిపేసుకునే వ్యక్తి జగన్‌. ప్రసాదాన్ని టిష్యూ పేపర్‌లో పెట్టి పక్కన పడేసే వ్యక్తి” అని అనిత మండిపడ్డారు. జగన్‌ ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఒక్క దళితుడికి కూడా అవకాశం ఇవ్వలేదన్న అనిత అలాంటి జగన్‌, తిరుమల ఆలయంలో దళితుల ప్రవేశం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నేను హిందువును. నీ మతమేంటో నువ్వు ధైర్యంగా చెప్పగలవా అని జగన్‌ని అనిత ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story