Vallabhaneni Vamsi: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు దిట్ట

Vallabhaneni Vamsi: చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 24 March 2023 4:00 PM IST
Vallabhaneni Vamsi Comments on Chandrababu Over MLC Elections
X

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు దిట్ట

Vallabhaneni Vamsi: చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించారు. తెలంగాణలో స్టీఫెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రలోభ పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ దుయ్యబట్టారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గెలిచాడని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు వంశీ.

చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటు.. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం గుర్తించిందన్నారు. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవన్న వంశీ.. సినిమాలో అన్నీ డూపులు అమర్చినట్లు వారి మాటలు కూడా డూపులే అని ఎద్దేవా చేశారు. సినిమాకి, రాజకీయానికి చాలా తేడా ఉంటుందని ఎమ్మెల్యే వంశీ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story