సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు.

S. Srikanth
Published on: 20 March 2020 5:37 PM IST
సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లేఖ
X
Payyavula Keshav (file photo)

ఉరవకొండ: సీఎం జగన్మోహన్ రెడ్డికి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. కరోనా వైరస్ ఉదృతి పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక తోడ్పాటు కింద ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు, రెండు నెలల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు.

కరోనా కారణంగా షడ్డౌన్ దిశగా పరిస్థితులు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలు జీవనోపాధి ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పేద ప్రజలను అదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పయ్యావుల కేశవ్ లేఖలో డిమాండ్ చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story