Payakaraopeta: కరోనా వైరస్ ప్రభావంతో ఉపమాక వెంకన్న ఆలయంలో దర్శనం రద్దు

ప్రసిద్ద పుణ్యక్షేత్రం టీటీడీ అనుబంధ ఆలయం ఉపమాక శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో భక్తులకు దర్శనం రద్దు చేయబడిందని డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.

S. Srikanth
Published on: 20 March 2020 9:05 PM IST
Payakaraopeta: కరోనా వైరస్ ప్రభావంతో ఉపమాక వెంకన్న ఆలయంలో దర్శనం రద్దు
X
Upamaka Venkateswara Swamy Temple (File Photo)

నక్కపల్లి: ప్రసిద్ద పుణ్యక్షేత్రం టీటీడీ అనుబంధ ఆలయం ఉపమాక శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో భక్తులకు దర్శనం రద్దు చేయబడిందని డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాధి ప్రబలుతున్నందున ప్రభుత్వాదేశాల మేరకు టీటీడీ ఆలయాన్నింటిలో భక్తులకు దర్శనం నిలిపివేయబడిందని తెలిపారు.

భక్తుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే స్వామివారి నిత్య పూజా, కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని, భక్తులకు దర్శనం మాత్రం అనుమతించబోమని తెలిపారు. కావున స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు, వాయిదా వేసుకోవాలని సూచించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ భక్తులు సహకరించాలని డిప్యూటీ ఈవో కోరారు.



S. Srikanth

S. Srikanth

Next Story