AP Capital: జగన్ సర్కార్‌కు బీజేపీ షాక్..

Sumitra
Updated on: 22 Jan 2020 10:12 AM IST
AP Capital: జగన్ సర్కార్‌కు బీజేపీ షాక్..
X
ఏపీ సీఎం జగన్

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ఈ అంశంపై కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా అంగీకరించడం లేదు. మూడు రాజధానుల విషయంలో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ కూడా ఇటీవలే రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేరంగా తీర్మానం చేసింది.

ఏపీలో ఒక్క రాజధాని మాత్రమే ఉండాలని అదికూడా కేవలం అమరావతి మాత్రమే అని తేల్చేసింది. జగన్ సర్కార్ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్రం మద్దతు ఇస్తు్ందని చెప్పడం అవాస్తవం అని బీజేపీ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ తెలిపారు. ఈ అంశంలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు.

ఈ విషయంపై సునీల్ స్పందించి తన ట్ట్విట్టర్ అకౌంట్ లో ఈ విధంగా ట్విట్ట్ చేసారు. 'అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటు చంద్రబాబు.. ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ-దొందే'అంటూ హెచ్చరించారు.

ఇదే విషయంలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. దియోధర్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో కేంద్రానికి చెప్పే జరుగుతోందని. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. దీన్న తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు పవన్ కళ్యాణ్.





Sumitra

Sumitra

Next Story