10వ తేదీన అండర్-12 జిల్లా స్థాయి క్రికెట్ ఎంపికలు

జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటలకు నగర శివారులోని వైయస్ఆర్- ఏసీఏ క్రికెట్ నెట్స్ లో అండర్ -12 జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు జరగనున్నాయి.

S. Srikanth
Published on: 8 Dec 2019 12:40 PM IST
10వ తేదీన అండర్-12 జిల్లా స్థాయి క్రికెట్ ఎంపికలు
X
అండర్ -12 క్రికెట్

కడప: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటలకు నగర శివారులోని వైయస్ఆర్- ఏసీఏ క్రికెట్ నెట్స్ లో అండర్ -12 జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ సంఘం కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01.09 2007 తర్వాత పుట్టిన వారు ఎంపికలకు అర్హులవుతారన్నారు. ఎంపికలో పాల్గొనే క్రికెటర్లు తెలుపు రంగు దుస్తులు, క్రికెట్ కిట్, షూతో రావాలన్నారు.

బర్త్ సర్టిఫికెట్, విద్యార్హత, ఆధార్ పత్రాలు ఒరిజినల్ తోపాటు మూడు సెట్లు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలన్నారు. లేనిపక్షంలో ఎంపికలకు అనుమతించమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఈనెల 19వ తేదీ నుండి నెల్లూరు జిల్లా వెంకటగిరి లో జరగనున్న అంతర జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల జట్లు పోటీ పడుతున్నాయని అన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story