తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం.. ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌

Tirupati: రాత్రి 2.30 గంటల సమయంలో.. రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగులు

Jyothi
Published on: 3 Oct 2023 10:19 AM IST
Two-year-old Boy Kidnapped at RTC Bus Stand in Tirupati
X

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం.. ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌

Tirupati: తిరుపతిలో కలకలం రేగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాత్రి రెండున్నర గంటల సమయంలో రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద బాలుడిని ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి వచ్చిన కుటుంబంగా తెలుస్తోంది. అయితే.. రాత్రి 12 గంటల 20 నిమిషాల సమయంలో బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో బాలుడి కుటుంబం నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాలుడి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story