అల్లుడి వేధింపులు: తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని..

అల్లుడి వేధింపులు: తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని..
x
Highlights

Two Daughters Commited Suicide: తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని మ‌న‌స్తాపం చెందిన ఇద్ద‌రు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘ‌ట‌న కడప జిల్లా...

Two Daughters Commited Suicide: తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని మ‌న‌స్తాపం చెందిన ఇద్ద‌రు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘ‌ట‌న కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులోని వైఎమ్‌ఆర్‌ కాలనీకి చెందిన బాబురెడ్డి.. కుటుంబ సమస్యలు, పెద్ద కూతరైన శ్వేతను భర్త వేదించడాన్ని తట్టుకోలేక సెల్ఫీవీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తండ్రి మరణవార్తను భరించలేని అతని ఇద్దరు కూతుళ్లు శ్వేత, ఇంజనీరింగ్‌ చదువుతున్న సాయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు - రాణిపేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories