Three People Lost Life: కడప జిల్లాలో శానిటైజర్ తాగి ముగ్గురి మృతి

Three People Lost Life: మత్తు కోసం మందుబాబులు మద్యానికి బదులు శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు...
Three People Lost Life: మత్తు కోసం మందుబాబులు మద్యానికి బదులు శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు. నిన్న శానిటైజర్ తాగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం ఇంటి వద్ద మరొకరు చనిపోయారు.
మృతులను చెన్నకేశవులు, భీమయ్య, ఓబులేష్‌లుగా గుర్తించారు. అంతేకాదు ఈ ప్రాంతంలో వారం రోజుల నుంచి ఆరుగురు శానిటైజర్ తాగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.. మద్యం ధరలు భరించలేక మందుబాబులు ఇలా శానిటైజర్ తాగుతున్నారని మృతుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల క్రితమే ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 16మంది చనిపోయిన చేరిన సంగతి తెలిసిందే.