TTD: టీటీడీ బంపర్ ఆఫర్.. ఈ అవకాశం వారికి మాత్రమే..!

TTD Kalyanamasthu Programme Restarting
x

TTD:టీటీడీ బంపర్ ఆఫర్.. ఈ అవకాశం వారికి మాత్రమే..!

Highlights

TTD: టీటీడీ బంపర్ ఆఫర్.. ఈ అవకాశం వారికి మాత్రమే..!

TTD: పెళ్లి చేసుకోవాలనుకునే పేద యువతి, యవకులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు కూడా సిద్దం చేసింది. ముహూర్తం కూడా ఖరారైంది. ఈ మేరకు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 7వ తేదిన ఏపీలోని 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాని నిర్వహించనున్నట్లు తెలిపారు.

అర్హులైన పేదవారు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. సింహలగ్నంలో ఉదయం 8 గంటల నుంచి 8:17 నిమిషాల మద్య సామూహిక వివాహాలను జరిపిస్తామన్నారు. సామూహిక వివాహాలకు వేద పండితులు మహూర్తం నిర్ణయించారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వివాహం చేసుకునే జంటలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సీఎంలు ముందుకు వస్తే ఆ ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

కరోనా కారణంగా రెండేళ్లుగా కళ్యాణమస్తు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. 2007 పిభ్రవరి 22వ తేదిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని అప్పటి సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కళ్యాణమస్తూ కార్యక్రమం నిర్వహణ ద్వారా దాదాపు 45 వేల జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి ఖర్చు భరించలేని పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories