ఉపమాక వెంకన్నఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు

మండలం ఉపమాకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారిని టీటీడీ సభ్యుడు పరిగెల మురళీకృష్ణ శనివారం దర్శించుకున్నారు.

S. Srikanth
Published on: 15 Dec 2019 3:58 PM IST
ఉపమాక వెంకన్నఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు
X

నక్కపల్లి: మండలం ఉపమాకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారిని టీటీడీ సభ్యుడు పరిగెల మురళీకృష్ణ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన అర్చకుడు జి.వరప్రసాదాచార్యులు, సూపరింటెండెంట్ ఎన్.హరిబాబు సిబ్బంది మురళీకష్ణకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోదాదేవి సన్నిధి వద్ద ఆశీర్వచనం, ప్రసాదములు స్వీకరించారు. స్వామి వారి చిత్ర పటాన్ని జ్ఞాపికగా అందచేశారు. అనంతరం ఆలయంలో చేపట్టవలసిన పలు అభివృధ్ది పనులపై ఆలయ వర్గాలతో చర్చించారు. వీరి వెంట ఇంజనీరింగ్ డిఈ దామోదర్, జేఈ.శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ పృధ్వీ తదితరులు ఉన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story