Anantapur: విషాదం.. భార్యను, కుమార్తెను చంపి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భర్త

Anantapur: కుటుంబంలో విషాదం నింపిన ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్

Shekhar G
Published on: 10 Feb 2024 7:42 PM IST
Tragedy Husband Killed His Wife And Daughter And Committed Suicide By Falling Under The Train
X

Anantapur: విషాదం.. భార్యను, కుమార్తెను చంపి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భర్త

Anantapur: అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని చౌడేశ్వరీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. రామకృష్ణ అనే వ్యక్తి భార్య చంద్రావతి, కుమార్తె చైత్రికను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారైన రామకృష్ణ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ విషాదం నింపింది. ఆన్‌లైన్‌ బెట్టింగుల కారణంగా అప్పులు కావడంతో భార్య, భర్తల మధ్య కలహాలు ఏర్పడ్డాయి. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఒక కుటుంబంలో కలతలు చెలరేగి ఇరువురు హత్యకు గురై, మరొకరు ఆత్మహత్య చేసుకోవడం యాడికిలో సంచలనంగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story