నేడు రెండోరోజు ఏపీ బీజేపీ ముఖ్యనేతల భేటీ

BJP: హాజరుకానున్న జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు

Jyothi
Published on: 3 March 2024 10:17 AM IST
Today is the second day of Meeting of AP BJP Chief leaders
X

నేడు రెండోరోజు ఏపీ బీజేపీ ముఖ్యనేతల భేటీ

BJP: ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం నేడు రెండో రోజు కొనసాగనుంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 11 జిల్లాలకు చెందిన నేతలతో ఆ పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ రాష్ట్ర నాయకులతో చర్చించనున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ బలబలాలపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

అయితే నిన్న జరిగిన చర్చల్లో పొత్తులపై ఎలాంటి ప్రస్తావన రాలేదంటున్నారు బీజేపీ నేతలు. కాగా ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ద్విముఖ వ్యూహంతో ముందుకె‌ళ్తోంది బీజేపీ. అయితే పొత్తుల విషయాన్ని జాతీయ నాయకత్వమే చూసుకుంటుందంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.

Jyothi

Jyothi

Next Story