Tirumala: ఇవాళ ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి మే నెల దర్శనం టికెట్లు

Tirumala: సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లు

Jyothi
Published on: 19 Feb 2024 8:27 AM IST
Tirumala Srivari May Darshan tickets online From today
X

Tirumala: ఇవాళ ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి మే నెల దర్శనం టికెట్లు 

Tirumala: ఆన్‌లైన్‌లో ఇవాళ తిరుమల శ్రీవారి మే నెల దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో లక్కీడిప్ నమోదు చేయనున్నారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ టికెట్లు.. మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.

ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీ‌వాణి ట్రస్టు బ్రేక్ ద‌ర్శనం, గ‌దుల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శన టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం 300 టికెట్ల కోటాను ఈనెల 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేయనుండగా.. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.

Jyothi

Jyothi

Next Story