Tirumala remove from containment zone: తిరుమల కంటైన్మేంట్ జోన్ కాదు

Tirumala remove from containment zone: తిరుమల కంటైన్మేంట్ జోన్ కాదు
x
Tirumala remove from containment zone
Highlights

Tirumala remove from containment zone: తిరుమల దేవస్థానం కంటైన్మేంట్ కాదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతం వెంకటేశ్వరస్వామి దర్శనాలు కొనసాగుతుండటం వల్ల కేవలం కొన్ని ప్రాంతాలకే దీనిని పరిమితం చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Tirumala remove from containment zone: తిరుమల దేవస్థానం కంటైన్మేంట్ కాదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతం వెంకటేశ్వరస్వామి దర్శనాలు కొనసాగుతుండటం వల్ల కేవలం కొన్ని ప్రాంతాలకే దీనిని పరిమితం చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీవారి దర్శనాలు యధాతథంగా జరుగుతాయని, వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

తిరుప‌తిలోని ప‌లు వార్డుల‌తో పాటు తిరుమల‌ను కూడా కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించ‌డంతో వివాదం రాజుకుంది. టీటీడీ నుంచి అభ్యంత‌రాలు రావ‌డంతో.. మ‌రోమారు దీనిపై స్ప‌ష్టత ఇచ్చారు చిత్తూరు జిల్లా కలెక్ట‌ర్. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధి తిరుమ‌ల‌లో కూడా క‌రోనా కేసులు పెరుగుతూ ఉండ‌టం వ‌ల్ల జిల్లా ఉన్న‌తాధికారులు.. తిరుమ‌ల‌ను కూడా కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌రువాత కొద్ది సేప‌టికే తిరుమ‌ల‌ను పొర‌పాటున కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించామ‌ని చెబుతూ జిల్లా అధికారులు మ‌రో లిస్టును విడుద‌ల చేశారు.

తిరుమలను కంటైన్మెంట్ జోన్ పరిధి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది చిత్తూరు కలెక్టర్ కార్యాలయం. తిరుమల పేరు లేకుండా మళ్లీ కొత్త కంటైన్మెంట్ జోన్ లిస్ట్‌ను విడుదల చేసింది టీటీడీ. దీంతో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ఆటంకం తొల‌గిపోయింది. ఇక అలాగే భ‌క్తులు ఎలాంటి ఆందోళ‌న లేకుండా స్వామి వారిని ద‌ర్శించుకోవాల‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. తిరుమల కంటైన్మెంట్ జోన్ ప్రకటనపై మీడియాలో బ్రేకింగ్ రావడంతో చేసిన పొరబాటు గుర్తించిన‌ కలెక్టర్ కార్యాలయం.. వెంట‌నే ఆ లిస్టులో మార్పులు చేసి కొత్త లిస్టును రిలీజ్ చేసింది. కాగా క‌రోనా వ్యాప్తి కార‌ణంగా టీటీడీ ఇప్పుడు ప‌రిమిత సంఖ్య‌లో ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తులిస్తోంది. ప్ర‌స్తుతానికి రోజుకు పదివేల మందిని మాత్ర‌మే స్వామిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తుంది

Show Full Article
Print Article
Next Story
More Stories