Coronavirus Updates in AP: ఏపీలో మరో 1500 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Updated on: 9 July 2020 2:17 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో మరో 1500 కరోనా పాజిటివ్‌ కేసులు
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1500 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్‌ని పరీక్షించగా 1500 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 904 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరిలో మరొకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 21,071. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 277. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 10,250కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 10,544 మంది చికిత్స పొందుతున్నారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story