Tirumala: వేదపాఠశాలలో కరోనా కలకలం.. ఏకంగా 57మందికి పాజిటివ్

Arun Chilukuri
Published on: 10 March 2021 9:56 AM IST
Tirumala: వేదపాఠశాలలో కరోనా కలకలం.. ఏకంగా 57మందికి పాజిటివ్
X

ఫైల్ ఇమేజ్ 

Tirumala: తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత నెలలోనే పాఠశాల ప్రారంభంకాగా 450 మంది విద్యార్థులకు కొవిడ్ టెస్టులు చేయించారు. వీరిలో 57 మందికి పాజిటివ్ రిపోర్టు రావడంతో వెంటనే వారిని తిరుపతిలోని స్విమ్స్‌కి తరలించారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచారు. వేద పాఠశాలలో విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story