Tiruchanur: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం

Tiruchanur: శ్రీపద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అవభృథోత్సవం

Jyothi
Updated on: 29 Nov 2022 6:58 AM IST
Tiruchanur Sri Padmavathi Ammavari Panchami Theertham
X

Tiruchanur: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం

Tiruchanur: పవిత్ర వేద మంత్రోచ్చారణ.. మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అవబృథోత్సవం కన్నులపండువగా సాగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారి చక్రస్నానఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి సన్నిధినుంచి ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పసుపు,కుంకుమ, తులసీదళాలతో పవిత్ర సారెను ఏనుగులపై తీసుకొచ్చి పద్మావతి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి జన్మ తిథిని పురస్కరించుకుని పంచమీతీర్థంపేరుతో అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి, సుదర్శన చక్రమూర్తికి పుష్కరిణిలో పుణ్యస్నానమాచరింపజేశారు. చక్రస్నాన ఘట్టంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకలశుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తిరుచానూరులోని పద్మ సరోవరం భక్తజన సంద్రాన్ని తలపించింది.

Jyothi

Jyothi

Next Story