Time Slot Tokens Stoped From Today: నేటి నుంచి టైంస్లాట్ టోకెన్లు నిలిపివేత.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం

Time Slot Tokens Stoped From Today: కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానికి ఇదే నిదర్శనం..

Bathula Yesu Babu
Published on: 21 July 2020 8:15 AM IST
Time Slot Tokens Stoped From Today: నేటి నుంచి టైంస్లాట్ టోకెన్లు నిలిపివేత.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం
X
Time Slot Tokens Stoped in tirumala

Time Slot Tokens Stoped From Today: కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానికి ఇదే నిదర్శనం... నాలుగైదు రోజు ల క్రితం సింగిల్ నెంబరు మీదుంటే పాజిటివ్ కేసులు ప్రస్తుతం రెండు దాటి మూడు నెంబర్లకు చేరాయి. తాజాగా టీటీడీలో 170 మంది వరకు పాజిటివ్ లు నమోదయినట్టు తెలుస్తోంది. తిరుపతిలో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా ప్రకటించారు. లేనిపక్షంలో ఇది మరింత తీవ్రరూపం దాల్చుతుందని ఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్‌ తిరుమల, తిరుపతిల్లో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మద్యకాలంలోనే శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు తిరుపతిలోనూ కరోనా తీవ్రరూపం దాల్చడతో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని టీటీడీ కార్యాలయాల్లో విధులను నిలిపివేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది.

శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతి నగరంలో కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అలపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం అనగా జూలై 21వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేసింది. కాగా, తిరిగి టోకెన్లను జారీ చేసే తేదీ ఎప్పుడన్నది త్వరలోనే చెబుతామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story