తూర్పుగోదావరి జిల్లలో కాలువలోకి దూసుకుపోయిన బైక్ : ముగ్గురు గల్లంతు

K V D Varma
Published on: 23 July 2019 10:42 AM IST
తూర్పుగోదావరి జిల్లలో కాలువలోకి దూసుకుపోయిన బైక్ : ముగ్గురు గల్లంతు
X

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాదం నెలకొంది. గుడిమెళ్లలంకలో పంట కాల్వలోకి పల్సర్ బైక్ దూసుకుపోయింది. ఘటన జరిగిన సమయంలో బైక్‌పై ఐదుగురు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మహిళ మృతదేహం కోసం గాలిస్తున్నారు. చనిపోయిన పిల్లలు మేడూరు భార్గవి, కిరణ్మయిగా గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామానికి సుగుణ తన ఇద్దరు పిల్లలు భార్గవి(5), కిరణ్మయి(4)తో కలిసి అన్న బ్రహ్మాజీ, వారి బంధువు కృప(23) ఒకే బైక్ పై నాటు వైద్యం చేసుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిమండలం పెదలంకకు వెళ్తున్నారు. గుడిమెల్లంక వంతెన సమీపంలోని వినాయకుని గుడివద్ద వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి గుడిమెల్లంక ప్రధాన పంట కాల్వలోకి దూసుకుపోయింది. బ్రహ్మాజీ, సుగుణలకు ఈతరావడంతో బయటకు వచ్చేశారు. కృప, భార్గవి, కిరణ్మయి పంటకాల్వలో మునిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కృప, భార్గవి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story