JewelleryShop Robbery in Vijayawada: పట్టప‌గ‌లే విజ‌య‌వాడ‌లో భారీ దోపిడీ...

JewelleryShop Robbery in Vijayawada: కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. మరోవైపు దొంగలు చేతి వాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు.

Karampoori Rajesh
Published on: 24 July 2020 4:56 PM IST
JewelleryShop Robbery in Vijayawada: పట్టప‌గ‌లే విజ‌య‌వాడ‌లో భారీ దోపిడీ...
X
thieves rob saicharam jewellery shop in vijayawada

JewelleryShop Robbery in Vijayawada: కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. మరోవైపు దొంగలు చేతి వాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ వన్ టౌన్‌లో ప‌రిధిలోని సాయిచరణ్ జ్యూయలరీ షాపులో దోపిడీ జ‌రిగింది. ఏడు కేజీల బంగారం, రూ.30 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. జ్యూయలరీ షాపునకు చెందిన బంగారాన్ని ఓ చోట భద్రపరిచి.. ప్రతి రోజూ మళ్లీ ఉదయాన్నే తీసుకుని వెళ్తారు. ఈ రోజు కూడా అలా కంపెనీ గుమాస్తా బంగారాన్ని తీసుకుని షాపు దగ్గరికి వచ్చాడు. దొంగలు అతడితోపాటు, వాచ్ మన్‌పై బ్లేడ్లతో దాడి చేశారు. బంగారం, నగలు, నగదు దోచుకెళ్లారు. వెండి మాత్రం వదిలేశారు. దీంతో ఆ గుమస్తా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు గుమస్తా, వాచ్ మెన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకుంటే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story