SBI ATM: అయిటిపాములలో ఎస్‌బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన దుండగులు.. రూ.23 లక్షలు చోరీ

SBI ATM: విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో

Shekhar G
Published on: 30 July 2023 3:24 PM IST
Theft At SBI Bank ATM In Aitipamula Nalgonda District
X

SBI ATM: అయిటిపాములలో ఎస్‌బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన దుండగులు.. రూ.23 లక్షలు చోరీ

SBI ATM: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఏటీఎంలో ఉన్న 23 లక్షల రూపాయలను అపహరించారు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... సీసీ ఫుటేజ్ ను పరిశీస్తున్నారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో ఉన్న సీసీకెమెరాలను కట్ చేసి....లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంలోని డబ్బులను దోచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏటీఎం సెంటర్‌లో రెండు ఏటీఎంలు ఉండగా... ఔట్ సోర్సింగ్ ఏటీఎంలో దాదాపు 23 లక్షలు, ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షల క్యాష్ ఉన్నట్లుగా బ్యాంక్ అధికారులు తెలిపారు. SBI మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story