తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు .. 13 మందికి జీవిత ఖైదు..

Tenali Court: మొత్తం 21 మంది నిందితుల్లో నలుగురు మృతి

Shekhar G
Updated on: 21 Jun 2023 5:17 PM IST
The Tenali Court Gave A Sensational Verdict
X

తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు : 2016 నాటి అడవులదీవి కేసులో.. 13 మందికి జీవిత ఖైదు..

Tenali Court: తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కట్టిన కేసులో 13 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొత్తం 21 మంది నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు చనిపోగా.. మిగిలిన 17 మందిలో 13 మందికి శిక్ష విధించింది కోర్టు. మరో నలుగురికి కేసు నుంచి రిలీఫ్‌ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.

2016లో రేపల్లెకు చెందిన జాస్మిన్ అనే వ్యక్తి మృతికి... శ్రీసాయి అనే యువకుడు కారణమని అతన్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. నిజాంపట్నం మండలం అడవులదీవిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. గ్రామస్తుల దాడిలో గాయపడిన యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో మొత్తం 21 మందిని నిందితులుగా చేరుస్తూ కేసు నమోదవగా.. 13 మందికి జీవితఖైదు విధించింది తెనాలి కోర్టు.

Shekhar G

Shekhar G

Next Story