Tuni: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం: ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధికారులకు పిలుపు నిచ్చారు.

S. Srikanth
Published on: 12 Feb 2020 8:29 PM IST
Tuni: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం: ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా
X

తుని : ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధికారులకు పిలుపు నిచ్చారు. తుని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమీక్షించారు. సందర్భంగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ పింఛన్లు రేషన్ కార్డులు అర్హులైన లబ్ధిదారుల అందరికీ పంపిణీ చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు అన్నారు.

పేదలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని పేదలను గుర్తించి వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశించారు.


S. Srikanth

S. Srikanth

Next Story