AP High Court: వైసీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరించిన ఏపీ హైకోర్టు

AP High Court: మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదన్న హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Sept 2024 5:30 PM IST
AP High Court
X

AP High Court

AP High Court: వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ నేతలు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై సాయంత్రం హైకోర్టు నిర్ణయం వెలువరించింది.

వైసీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్‌ నిందితుడిగా ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story