Chandrababu: చంద్రబాబు పర్యటనలో పోలీసుల ఆంక్షలు.. అనపర్తిలో ఉద్రిక్తత

Chandrababu: మెయిన్‌రోడ్డులో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులు

Jyothi
Published on: 17 Feb 2023 7:15 PM IST
Tension in Anaparthi East Godavari District
X

Chandrababu: చంద్రబాబు పర్యటనలో పోలీసుల ఆంక్షలు.. అనపర్తిలో ఉద్రిక్తత

Chandrababu: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెయిన్‌రోడ్డులో చంద్రబాబు సభ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెయిన్ రోడ్డులో చంద్రబాబు ప్రసంగానికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. అయితే సభను నిర్వహించి తీరుతామని టీడీపీ శ్రేణులు తేల్చిచెప్పారు. దీంతో సభ స్థలి వద్ద భారీగా పోలీసులు, పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. అనపర్తి దేవిచౌక్ ఎంట్రన్స్‌ను బారికేడ్లతో మూసేశారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు నెట్టుకొని సభకు పరుగులు తీశారు.

Jyothi

Jyothi

Next Story