Perni Nani: మాజీ మంత్రి పేర్నినాని నివాసం దగ్గర ఉద్రిక్తత

Perni Nani: లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్‌పై నాని వ్యాఖ్యాలకు నిరసనగా... ధర్నా

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Sept 2024 2:17 PM IST
Tension At Perni Nani Residence
X

Perni Nani: మాజీ మంత్రి పేర్నినాని నివాసం దగ్గర ఉద్రిక్తత

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు ఉద్రిక్తతనెలకొంది. తిరుపతి లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటి ముందు జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. పవన్ కళ్యాణ్‌కు నాని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి వెనక్కి పంపారు. ఆందోళనకు దిగిన జనసేన ఇంచార్జీ బండి రామకృష్ణతో సహా ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story