Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..

Kamareddy: స్కూల్‌కి వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీసిన పేరెంట్స్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Sept 2024 4:02 PM IST
Tense Situation In Kamareddy After The Teacher Misbehaved With Student Suri
X

Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవదాన్ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూకేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. పీఈటీ టీచర్ నాగరాజు విద్యార్థినిని రూమ్‌లో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. పేరెంట్స్ స్కూల్‌‌కు వెళ్లి పాఠశాల సిబ్బందిని నిలదీశారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పీఈటీ టీచర్ నాగరాజుపై ఫిర్యాదు చేశారు.

పోలీసులు నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి. స్కూల్‌పై రాళ్ల దాడి చేయడంతో పాటు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story