Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ @ వర్క్ ఫ్రం హోమ్!

K V D Varma
Updated on: 21 March 2020 1:09 PM IST
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ @ వర్క్ ఫ్రం హోమ్!
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యాలయాల్లో పనిచేసే వారిని ఇంటి వద్ద నుంచే పని చేయాల్సింది గా సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులు, ప్రధాని మోడీ సూచనలకు అనుగుణంగా తమ సిబ్బందిని వర్క్ ఫ్రం హోమ్ పధ్ధతి పాటించాల్సిందిగా అయన చెప్పారు. అత్యవసర పని వుంటే తప్ప ఆఫీసుకు ఎవరూ రావద్దని చెప్పారు. ఈ మెయిల్, వాట్సప్ ద్వారా సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. పార్టీ ఆఫీసు లోకి కార్యకర్తలను, సందర్శకులను అనుమతించడం లేదు. కేవలం ముఖ్యమైన నాయకులు.. అదీ అత్యవసర పని ఉంటేనే హాజరు అవుతున్నారు. ఈ సమయంలో కూడా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పూర్తిగా కార్యాలయం లోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.

ఇదిలా ఉండగా కరోన వైరస్ పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బుక్లెట్, పామ్ప్లేట్ ముద్రించారు. వీటిని చంద్రబాబు విడుదల చేశారు.

K V D Varma

K V D Varma

Next Story