ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

K V D Varma
Published on: 23 July 2019 10:25 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
X

ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్న టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి,నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. ఈ సెషన్‌ ముగిసే వరకు సభకు రావొద్దని ఆ ముగ్గురిని స్పీకర్‌ ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తూ వస్తున్నారు. స్పీకర్‌ సూచనలు పట్టించుకోకుండా పోడియం వద్దకు దూసుకొచ్చారు. స్పీకర్ మైకును లాగేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది.

K V D Varma

K V D Varma

Next Story