Badvel: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలి: టీడీపీ

నగరంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

S. Srikanth
Published on: 15 March 2020 8:08 PM IST
Badvel: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలి: టీడీపీ
X

కడప : నగరంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం వచ్చిన తరువాత భారత దేశంలో ఇంత దారుణంగా ఎలక్షన్ ఎప్పుడూ జరగలేదని,అధికారులు, పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాయడం మంచిదికాదన్నారు.కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికలను వాయిదా వేశారని,ఎన్నికలను వాయిదా వేయడం కాదు, రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

గతంలో ఎన్నో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, 1% కూడా నామినేషన్ రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవన్నారు.ప్రజలలో ఈ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని,అందుకు బయటపడిన ఈ వైసీపీ ప్రభుత్వం నామినేషన్లను రిజెక్ట్ చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిపితే 75%మెజారిటీతో టిడిపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story