Anantapur: కియా పరిశ్రమ పై రాజకీయం తగదు: బి.కే పార్థసారథి

Anantapur: కియా పరిశ్రమ పై రాజకీయం తగదు: బి.కే పార్థసారథి
x
Highlights

అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం కియా పరిశ్రమ వద్ద ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు.

అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం కియా పరిశ్రమ వద్ద ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్థసారథి మాట్లాడుతూ కియా పరిశ్రమ ప్రతినిధులను బెదిరించడం, కియా పరిశ్రమను వెళ్ళిపోవాలనే అంశాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు కియా పరిశ్రమ రావడానికి చంద్రబాబు నాయుడే కారణమని తెలిపారు. ఒక ఎకరానికి 10 లక్షల 50 వేలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయ వ్యభిచారం గురించి మాట్లాడటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. దేశంలోనే రేప్ కేసులు ఉన్న ఎంపీగా పేరుగాంచిన గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రావడమే దౌర్భాగ్యం అనుకుంటే ఇప్పుడు నీతో మాట్లాడడం మరీ దారుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాస్ పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories