టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జ‌ల కన్నుమూత

Bojjala Gopala Krishna Reddy: మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు.

Arun Chilukuri
Published on: 6 May 2022 3:54 PM IST
TDP Leader Former Minister Bojjala Gopala Krishna Reddy Passed Away
X

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జ‌ల కన్నుమూత

Bojjala Gopala Krishna Reddy: మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంతున్న బొజ్జలకు గుండెపోటు రావడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. శ్రీకాళహస్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బొజ్జల మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story