ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఖాళీ .. గుప్పెట్లోమాత్రం వేలటన్నుల ఇసుక : దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.

Samba Siva Rao
Published on: 7 Jun 2020 10:53 AM IST
ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఖాళీ .. గుప్పెట్లోమాత్రం వేలటన్నుల ఇసుక : దేవినేని ఉమ
X
Devineni Uma (File Photo)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇసుకను ఆన్‌లైన్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల లోపు బుక్‌ చేసుకునేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అవకాశం కల్పించిందని, అయితే కొన్ని కేంద్రాల్లో 15 నిమిషాల్లో ఇసుకంతా బుక్‌ అయినట్లు చూపుతోందని అందులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉమ ట్వీట్ చేశారు.. '' ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఇసుక ఖాళీ. మీ నాయకుల గుప్పెట్లో మాత్రం వేల టన్నుల ఇసుక. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్ యార్డ్ లో 20 వేలు చూపించడం లేదు. లారీ ఆపిన అధికారులకు బెదిరింపులు మీ నేతల అండర్ కవర్ అవినీతితో, ఇసుక దోపిడితో రోడ్డున పడ్డ భవననిర్మాణ కార్మికుల కుటుంబాలకు సమాధానం చెప్పండి జగన్‌ గారు' అంటూ దేవినేని ఉమ నిలదీశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story