Vijayawada: పేదలకు ఇళ్ల స్థలాలంటూ 450 ఎకరాలు దోపిడీ

Vijayawada: పేదలకు ఇళ్ల స్థలాలంటూ 450 ఎకరాలు దోపిడీ
x
దేవినేని ఉమా (ఫైల్ ఫోటో)
Highlights

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నమానే పేరుతో 450 ఎకరాల భూమిని కాజేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

విజయవాడ: పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నమానే పేరుతో 450 ఎకరాల భూమిని కాజేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కొత్తూరు తాడేపల్లిలో ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌ రాజభవనం లాంటి భవంతిలో ఉంటూ పేదలకు సెంటూ స్థలం ఇవ్వడం లేదని దేవినేని ఉమ మండిపడ్డారు.

ఇదే విషయమై బోడె ప్రసాద్ మాట్లాడుతూ ''ఇళ్ల స్ధలాల పేరుతో పెనమలూరు నియోజకవర్గంలో 130కోట్లు అవినీతి జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయకుండా కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఇసుకమాఫియా ద్వారా 1500 కోట్ల రూపాయలు మింగేశారు. మద్యం కంపెనీల నుంచి కమీషన్లు పొందుతున్నారు'' అని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories